• facebook
  • whatsapp
  • telegram

దేశంలో 24 నకిలీ విశ్వవిద్యాలయాలు  

దిల్లీ: దేశంలో 24 నకిలీ విశ్వవిద్యాలయాలు ఉన్నాయని, మరో 2 వర్సిటీలు నిబంధనలను అతిక్రమించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆగ‌స్టు 2న‌ లోక్‌సభకు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా నకిలీ విద్యాసంస్థలను యూజీసీ గుర్తించిందని మంత్రి పేర్కొన్నారు. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 8, దిల్లీలో 7; ఒడిశా, పశ్చిమబెంగాల్లో రెండేసి చొప్పున; కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరి, మహారాష్ట్రలలో ఒక్కొక్కటి చొప్పున నకిలీ విశ్వవిద్యాలయాలు ఉన్నాయని వివరించారు. 
 

Posted Date : 03-08-2021