• facebook
  • whatsapp
  • telegram

సెప్టెంబ‌ర్ 18న ఆయుష్ పరీక్ష‌

 

దేశంలోని వివిధ క‌ళాశాల‌ల్లో ఆయుర్వేద‌, యునానీ, సిద్ధ అండ్ హోమియోప‌తి కోర్సుల్లో ఎండీ/ ఎంఎస్‌/ పీజీ డిప్లొమాలో ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించే ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్ (ఏఐఏపీజీఈటీ-2021) సెప్టెంబ‌ర్ 18న జ‌ర‌గ‌నుంది. ఈమేర‌కు నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ప్ర‌క‌టించింది. ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ ఆగ‌స్టు 21తో ముగుస్తుంది. ప‌రీక్ష స‌మ‌యం రెండు గంట‌లు కాగా రెండు షిఫ్టుల్లో జ‌రుగుతుంది. మొద‌టి షిఫ్టు(ఆయుర్వేద‌) ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి, రెండో షిఫ్టు(హోమియో, సిద్ధ‌, యునానీ) సాయంత్రం 3 గంట‌ల నుంచి 5 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హిస్తారు. ఆయుర్వేద ప్ర‌శ్నప‌త్రం ఇంగ్లిష్, హిందీ భాష‌ల్లో ఉండ‌నుండ‌గా.. హోమియో ప‌రీక్ష కేవ‌లం ఇంగ్లిష్‌లో మాత్ర‌మే ఉంటుంది. ఇక సిద్ధ ప్ర‌శ్న‌ప‌త్రం ఇంగ్లిష్‌, త‌మిళ్‌, యునానీ ప‌రీక్ష ఇంగ్లిష్‌, ఉర్దూ భాష‌ల్లో జ‌రుగుతుంది.

వెబ్‌సైట్‌: https://aiapget.nta.ac.in/