• facebook
  • whatsapp
  • telegram

వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఈడబ్ల్యూఎస్‌ కోటా

ఈనాడు, అమరావతి: వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఆర్థిక బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) కోటాను ఈ ఏడాది సైతం అమలు చేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి కార్యదర్శి సుధీర్‌ ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. అర్హులైన విద్యార్థులు ప్రవేశాల ప్రక్రియ సమయంలో వివరాలను అందించాలని సూచించారు. 
ఇంటర్‌ ప్రైవేటు విద్యార్థులకు హాజరు మినహాయింపు
ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సఫ్లిమెంటరీ పరీక్షలకు ప్రైవేటు విద్యార్థులకు హాజరు మినహాయింపు, గ్రూపు మార్పునకు అనుమతిస్తూ ఇంటర్‌ విద్యా మండలి కార్యదర్శి రామకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబరులో జరగనున్న అడ్వాన్స్‌డ్‌ సఫ్లిమెంటరీకి ఆర్ట్స్‌ అభ్యర్థులు హాజరు మినహాయింపు రుసుం రూ.1,300ను ఈనెల 11లోపు చెల్లించాలని సూచించారు. బైపీసీ ఉత్తీర్ణులైనవారు అదనంగా గణిత సబ్జెక్టు పరీక్షకు హాజరు కావొచ్చు.

Posted Date : 03-08-2021