• facebook
  • whatsapp
  • telegram

ఉద్యోగాల భర్తీలో దివ్యాంగుల రిజర్వేషన్‌ మరో పదేళ్లు  

ఈనాడు డిజిటల్, అమరావతి: వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగాల భర్తీలో దివ్యాంగుల రిజర్వేషన్‌ను ప్రభుత్వం మరో 10 ఏళ్లు పొడిగించింది. ఈ ఏడాది మే 31వ తేదీ నాటికి పొడిగింపు ముగిసిన నేపథ్యంలో 2031 మే 31వ తేదీ వరకు పొడిగిస్తూ మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి అనురాధ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వయోపరిమితి సడలింపు, ఏపీపీఎస్సీ భర్తీ చేసే ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు మినహాయింపునకు కూడా ఇది వర్తిస్తుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేస్తూ సాధారణ పరిపాలనశాఖ మరో ఉత్తర్వును జారీ చేయనుంది.

Posted Date : 03-08-2021