• facebook
  • whatsapp
  • telegram

05-08-2021 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. అన్ని కోర్సుల్లో యాజ‌మాన్య కోటా 30%

ఈనాడు, అమరావతి: సాధారణ డిగ్రీ, పీజీ సహా అన్ని వృత్తి విద్యా కోర్సుల్లోనూ కన్వీనర్‌ కోటా 70%, యాజమాన్య కోటా 30 శాతంగా సీట్లు ఉండనున్నాయి. ఇప్పటి వరకు ఎల్‌ఎల్‌బీ, బీఈడీ, బీపీఈడీ లాంటి కోర్సుల్లో కన్వీనర్‌ కోటా 75%, యాజమాన్య కోటా 25శాతంగా ఉంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

2. డిగ్రీలో కామ‌ర్స్‌కు అత్య‌ధిక ఆద‌ర‌ణ‌

‣ 65,897 మందికి బీకాం సీట్ల కేటాయింపు

‣ దోస్త్‌లో 1,67,130 మందికి దక్కిన సీట్లు

ఈనాడు, హైదరాబాద్‌: డిగ్రీలో కామర్స్‌ కోర్సుకు అధిక ఆదరణ లభిస్తోంది. డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ(దోస్త్‌) సీట్ల కేటాయింపును పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. మొత్తం సీట్లు పొందిన వారిలో దాదాపు 40 శాతం మంది కామర్స్‌ కోర్సులోనే చేరనున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

3. ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల‌ల్లో ఎన్‌సీసీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో నేషనల్‌ కేడెట్‌ కార్ప్‌(ఎన్‌సీసీ) విభాగాలను నెలకొల్పాలని ఇంటర్‌ విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు కమిషనర్‌ జలీల్‌ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4. 6 నుంచి పాలిసెట్ ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న‌ 

కరీంనగర్‌ (గణేశ్‌నగర్‌), న్యూస్‌టుడే: పాలిసెట్‌-2021 ప్రవేశాలకు సంబంధించి ధ్రువ పత్రాల పరిశీలన ఆగస్టు 6 నుంచి ప్రారంభం కానుంది. ప్రవేశ పరీక్షలో ర్యాంకులు సాధించిన విద్యార్థులు ముందుగా ప్రాసెసింగ్‌ రుసుం చెల్లించి, స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ జి.అప్పారావు తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

5. యూజీ, పీజీలో దరఖాస్తులకు ఆహ్వానం 

వరంగల్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ మణిపూర్‌లో యూజీ, పీజీ కోర్సుల్లో 2021-2022 సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారని జిల్లా యువజన, క్రీడల అధికారి గుగులోతు అశోక్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

Posted Date : 05-08-2021