• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌ మొదటి ఏడాది మార్కుల మెరుగుకు అవకాశం

 

ఈనాడు, అమరావతి: ఇంటర్‌ ప్రథమ సంవత్సరం నుంచి రెండో ఏడాదిలోకి వచ్చిన విద్యార్థులు మార్కులను పెంచుకునేందుకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావొచ్చని ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. కరోనా కారణంగా పరీక్షలను రద్దు చేసి, మొదటి ఏడాది వారికి కనీస ఉత్తీర్ణత మార్కులు కేటాయించారు. వీరు సబ్జెక్టు మార్కులను పెంచుకునేందుకు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పించారు. 

Posted Date : 05-08-2021