• facebook
  • whatsapp
  • telegram

పాలిటెక్నిక్‌ ఒప్పంద అధ్యాపకుల సేవల పునరుద్ధరణ

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో పని చేస్తున్న ఒప్పంద అధ్యాపకులు 316 మంది, వర్క్‌షాపు సహాయకులు 144 మంది సేవలను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021-22 విద్యా సంవత్సరానికి 10 రోజుల విరామంతో 12 నెలలకు వేతనం చెల్లించనున్నారు. ప్రతి ఏడాది సేవలను పునరుద్ధరించే ప్రక్రియ కారణంగా రెండు, మూడు నెలలు వేతనాలు ఉండడం లేదని, తమకు 60ఏళ్ల వరకు ఉద్యోగ భద్రత కల్పించాలని పాలిటెక్నిక్‌ ఒప్పంద అధ్యాపకుల అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు సాయిరాజు కోరారు. 

Posted Date : 03-08-2021