• facebook
  • whatsapp
  • telegram

అర్థం కాని పాఠాలు.. యాప్‌తో గురువుల చేదోడు

ఈనాడు, మహబూబ్‌నగర్‌: పైవేటు పాఠశాలలకు దీటుగా తమ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తున్నారు తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని షాసాబ్‌గుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు. ఇక్కడ తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో 134 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు టీ శాట్, డీడీ ఛానళ్ల ద్వారా పాఠాలు బోధిస్తుండగా.. అవి తమకు బాగా అర్థం కావడంలేదని ఈ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఇక్కడి ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు స్వయంగా ఆన్‌లైన్‌లో బోధించాలని నిర్ణయించారు. టీచ్‌మింట్‌ యాప్‌ ద్వారా వారం నుంచి గణితం, ఆంగ్లం, సైన్స్‌ పాఠాలు బోధించడం మొదలుపెట్టారు. స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్న 70 శాతం మంది విద్యార్థులు నేరుగా పాఠాలు వింటున్నారని, మిగతా వారు రికార్డు చేసిన పాఠాలను వింటున్నారని ఉపాధ్యాయులు ‘ఈనాడు’కు తెలిపారు.

Posted Date : 03-08-2021