• facebook
  • whatsapp
  • telegram

ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల ప్రచారం వర్తించదు

ఈనాడు, అమరావతి: ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల పరిస్థితి సందిగ్ధంలో పడింది. విద్యార్థుల ప్రవేశాలకు ప్రచారం చేయాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ఆదేశించిన కళాశాల విద్యాశాఖ ఎయిడెడ్‌కు మాత్రం అది వర్తించదంటూ పేర్కొనడంపై యాజమాన్యాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎయిడెడ్‌ కళాశాలలను ఆస్తులతో సహా ఇస్తే ప్రభుత్వం తీసుకుంటుందని, లేదంటే యాజమాన్యాలే నిర్వహించుకోవాలని గతంలో కళాశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు విద్యార్థుల ప్రవేశాలకు ప్రచారం అక్కర్లేదనడంతో యాజమాన్యాల్లో ఆందోళన నెలకొంది. ఎయిడెడ్‌ను ప్రభుత్వం తీసుకుంటుందా? ప్రైవేటుగా నిర్వహించుకునేందుకు అనుమతిస్తుందా? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

Posted Date : 05-08-2021